CBSE Sample Question Papers for Class 10 Telugu 2020 PDF Download

CBSE Sample Question Papers for Class 10 Telugu 2020

TELUGU CODE 007
X CLASS SECOND LANGUAGE
తెలుగు
SAMPLE QUESTION PAPER 2019-20

ప్రశ్న 1.
క్రింది గద్యభాగాన్ని చదివి దిగువనీయబడిన ప్రశ్నలకు సరైన జవాబులను ఎన్నుకొని వ్రాయండి.  5 x 2=10

జాతీయోద్యమ కవిత్వాన్ని పుష్కలముగా రచించిన కవి రాయప్రోలు సుబ్బారావు నాదు జాతి, నాదు దేశం, నాదు భాష అని ప్రబోధించారు. గురజాడ అప్పారావు గారి దేశభక్తి గేయం మొదలుకొని ఎందరో కవులు తమ సాహిత్యంతో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. జాతి సౌభాగ్యమే తన లక్ష్యమంటూ సాగిన గాంధీజీని ఆదర్శంగా తెలుగు కవులు వర్ణించారు. బసవరాజు అప్పారావు గారు రచించిన స్వరాజ్యలక్ష్మి పెండ్లి, కొల్లాయి కట్టితేనేమి లాంటి గేయాలలో గాంధీజీని కీర్తించారు. విదేశీ వస్తు బహిష్కరణలో కవుల ఆత్మల్లో గిరగిరా తిరిగింది రాట్నం . ‘తిప్పవే రాట్న మా దేశ చక్రంబు’ అంటూ దువ్వూరి వారు చక్కని పాట వ్రాశారు. గడియారంవారి శివభారతం, రాజశేఖర శతావధాని వారి రాణాప్రతాపసింహ చరిత్ర భారత జాతీయతను ఉన్నత శిఖరాలకు చేర్చినవి. 1905 లో జరిగిన బెంగాల్ విభజన దేశంలో జాతీయ ఉద్యమ స్ఫూర్తి ఆకాశాన్ని అంటేందుకు దోహదం చేసింది. తెలుగు కవులు తమతమ రచనలతో ప్రజల్లో స్వాతంత్ర్య కాంక్షను రగిలించారు.
ప్రశ్నలు:

(i) నాదు జాతి, నాదు దేశం, నాదు భాష అన్నదెవరు?
అ) గురజాడ
ఆ) కందుకూరి
ఇ) రాయప్రోలు
ఈ) చిలకమర్తి

(ii) గురజాడవారి ఏ గేయం జాతీయోద్యమానికి ప్రేరణనిచ్చింది?
అ) దేశభక్తి
ఆ) పూర్ణమ్మ
ఇ) కన్యక
ఈ) పెన్నేటిపాట

(iii) బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం ఏది?
అ) 1908
ఆ) 1905
ఇ) 1920
ఈ) 1942

(iv) “కొల్లాయి కట్టితేనేమి” గేయ కవి ఎవరు?
అ) గురజాడ
ఆ) గడియారం
ఇ)రాయప్రోలు
ఈ) బసవరాజు

v) జాతీయోద్యమంలో కవుల ఆత్మల్లో తిరిగినది ఏది?
అ) ఊహ
ఆ) రాట్నం
ఇ) కవ్వం
ఈ) ఆశ

భాగం – బి

ప్రశ్న 2.
ఈ క్రింది చిరునామాలతో లేఖను వ్రాయండి.   1 x 5=5

విజయవాడ, సిద్ధార్థ పాఠశాలలో 10వ,త రగతి చదువుతున్న అన్విత తమ పాఠశాలలో జరుపుకున్న తెలుగు భాషాదినోత్సవం గురించి వివరిస్తూ, హైదరాబాదులోని భారతీయ విద్యాభవన్ లో 10వ,తరగతి చదువుతున్న నివేదితకు వ్రాసినట్లు లేఖను వ్రాయండి.

ప్రశ్న 3.
క్రిందివానిలో ఒకదానిని గురించి వ్యాసం వ్రాయండి.  1 x 8 = 8
i) అవినీతి అంతం ప్రగతికి మూలం
ii) విద్యార్థులు – క్రమశిక్షణ
iii) విజ్ఞానయాత్రలు
iv) మాతృభాష గొప్పదనం

భాగం – సి

ప్రశ్న 4.
క్రింది పద్యపాదానికి గణవిభజన చేసి, దిగువనీయబడిన ప్రశ్నలకు జవాబులను గుర్తించండి.  4 x 1 = 4

ఫలముల్మెక్కెడివారు తత్ఫల రసాస్వాద క్రియాలోలురై

i) పై పద్యం ఏ పద్య లక్షణానికి చెందినది?
అ) చంపకమాల
ఆ) ఉత్పలమాల
ఇ) మత్తేభము
ఈ) శార్దూలము

ii) పై పద్యపాదంలో గణాలు ఏవి?
అ)భ,ర,న,భ,భ,ర,వ
ఆ)న,జ, భ,జ, జ,జ,ర
ఇ)స,భ,ర,న,మ,య,వ
ఈ)మ,స,జ,స,త,త,గ

iii) పై పద్యపాదం ఏ జాతికి చెందినది?
అ) వృత్తజాతి
ఆ) ఉపజాతి
ఇ) జాతి
ఈ) కందం

iv) పై పద్యపాదంలో ఎన్ని అక్షరాలున్నాయి?
అ) 20
ఆ) 21
ఇ) 18
ఈ) 19

ప్రశ్న 5.
క్రింది ప్రశ్నలను చదివి, దిగువనీయబడిన జవాబుల్లో సరైన దానిని ఎన్నుకొని వ్రాయుము.  4 x 1= 4

i) టుగాగమ సంధి’కి ఉదాహరణ ఏది?
అ) ముచ్చటాడు
ఆ) సరసపుమాట
ఇ) ముత్యపుటుంగరం
ఈ) చెచ్చెర

ii) ఆమ్రేడితము అనగా….
అ) ద్విరుక్తము యొక్క పరరూపము
ఆ) మొదటిసారి పలికినది
ఇ) సంయుక్త రూపము
ఈ) అచ్చు రూపము

iii) ‘వీడు చక్రపాణి’ ఇది ఏ సంధి?
అ) రుగాగమ
ఆ) పడ్వాది
ఇ) గ,స,డ,ద,వాదేశ
ఈ) ద్విరుక్తటకార

iv) కర్మధారయము అనగా ఏది?
అ) విశేషణ విశేష్యములతో కూడినది
ఆ) నామవాచకముతో కూడినది
ఇ) ద్విత్వాక్షరంతో కూడినది
ఈ) పరుషముతో కూడినది

ప్రశ్న 6.
క్రింది ప్రశ్నలకు దిగువనీయబడిన జవాబును ఎన్నుకొని వ్రాయండి.   2 x 1= 2

i) అన్యపదార్థ ప్రధానం కలిగిన సమాసం ఏది?
అ) ద్విగువు
ఆ) ద్వంద్వం
ఇ) బహుజొహీ
ఈ) రూపకం

ii) ‘సూర్యచంద్రులు’ ఏ సమాసం?
అ) ద్విగువు
ఆ) ద్వంద్వం
ఇ) బహుజొహి
ఈ) రూపకం

ప్రశ్న 7.
క్రింది ప్రశ్నలకు దిగువనీయబడిన సరైన జవాబును ఎన్నుకొని వ్రాయండి. 2 x 1= 2

i) “నల్లకల్వల్వోలె ఉల్లసిల్లెడు ఇరుల్
కాసారములలోన గ్రాలు గాత” ఇది ఏ అలంకారం?
అ) అర్థాంతరన్యాసం
ఆ) అతిశయోక్తి
ఇ) క్రమాలంకారం
ఈ) ఉపమాలంకారం

ii) క్రమాలంకారానికి మరొక పేరు??
అ) అతిశయోక్తి
ఆ) యథాసంఖ్యాలంకారం
ఇ) రూపకాలంకారం
ఈ) ఉపమాలంకారం

ప్రశ్న 8.
క్రింది జాతీయాలలో నాలుగింటికి సొంతవాక్య ప్రయోగం చేయండి. 4 x 1= 4
i) కనువిప్పు
ii) పుస్తకాల పురుగు
iii) కాలక్షేపం
iv) చమత్కారం
V) తునాతునకలు
vi) తామరతంపర

ప్రశ్న 9.
క్రింది సామెతలలో రెండింటికి అర్థాలు వ్రాయండి. 2 x 1= 2
i) పిట్టకొంచెం కూత ఘనం
ii) రొట్టె విరిగి నేతిలో పడ్డట్టు
iii) మానవసేవే మాధవసేవ
iv) చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం

ప్రశ్న 10.
క్రిందివానిలో దిగువనీయబడిన పదాలకు సరైన పర్యాయపదాలను ఎన్నుకొని వ్రాయండి. 2 x 1=2

i) అమృతము….
అ) సుధ, పీయూషము
ఆ) సుద్ద, సున్నము
ఇ) నీరు, తేనీరు
ఈ) పాయసము, పాలు

ii) చాడు….
అ) శరీరము, తనువు
ఆ) విధం, రీతి
ఇ) కన్ను, నయనం
ఈ) ఇంతి, స్త్రీ

భాగం-డి

ప్రశ్న 11.
క్రిందివానిలో ఒక ప్రశ్నకు జవాబు వ్రాయండి. 1 x 4= 4
i) మంథరుని మాటలను మీరు సమర్థిస్తారా? ఎందుకు?
ii) గోరంతదీపాలు కథానికలో వృద్ధుని పాత్రస్వభావాన్ని, గొప్పదనాన్ని వ్రాయండి.

ప్రశ్న 12.
కిందివానిలో ఒక ప్రశ్నకు క్లుప్తంగా జవాబు వ్రాయండి. 1 x 2 = 2
i) చిత్రగ్రీవానికి తల్లిపక్షి, తండ్రి పక్షి నుండి ఏమేమి సంక్రమించాయి?
ii) ఆచార్య నాగార్జునుని స్వభావాన్ని విశ్లేషించండి.

ప్రశ్న 13.
క్రిందివానిలో రెండిటికి అర్థసందర్బాలను వ్రాయండి. 2 x 3= 6
i) శాల్యూట్లన్నీ హీరోలకే, హీరోయిన్లు ఆ తరువాతే.
ii) అదృష్టవంతునికి కన్నీటితో అభిషేకం జరుగుతున్నప్పుడు.
iii) వెళ్ళవయ్యా వెళ్ళు! ఎంతో ముఖ్యమైన పనిలో ఉన్నాను.
iv) సత్సంగతికంటే లోకమందు మేలేదియు లేదు.

ప్రశ్న 14.
క్రింది పద్యాలలో ఒకదానికి ప్రతిపదార్థం వాయండి. 1 x 7=7

i) వేద పురాణ శాస్త్ర పదవీ నదవీయసియైన పెద్ద ము
తైదువ కాశికానగర హాటక పీఠ శిఖాది రూఢ య
య్యాదిమ శక్తి సంయమిరా! యిటు రమ్మని పిల్చె హస్త సం
జ్ఞాదరలీల రత్న ఖచితాభరణంబులు ఘల్లు ఘల్లనన్

ii) తన చూపంబుధిమీద జాచి శ్రవణ ద్వంద్వంబు రిక్కించి వం
చిన చంచద్భుజముల్ సముత్కట కటిసీమంబులన్ బూన్చితో
కనభోవీధికి పెంచి, యంఘ్రులిటియంగా బెట్టి బిట్టూది గ్ర
క్కున నక్కొండ యడంగ దొక్కి పయికిం గుప్పించి లంఘించుచోన్

ప్రశ్న 15.
క్రిందివానిలో ఒక ప్రశ్నకు జవాబు వ్రాయండి. 1 x 4 = 4

i) ‘మాణిక్యవీణ’ కవితా సారాంశాన్ని వ్రాయండి.
ii) మీ పాఠ్యభాగం ఆధారంగా శివాజీ వ్యక్తిత్వాన్ని వ్రాయండి.

ప్రశ్న 16.
క్రిందివానిలో రెండిటికి అర్థసందర్బాలను వ్రాయండి. 2 x 3= 6
i) “పద్మిని పతిభక్తి సత్త్వమున మేలిమికిం గుజిదాన పొమ్మనన్”
ii) నీ యెడ దొసంగుల్లేమి భావించితిన్.
iii) పెరుగు తాలిమినీయదె వెన్న భాస్కరా!
iv) ఇవ్వీటి మీద నాగ్రహము తగునే?

ప్రశ్న 17.
క్రిందివానిలో రెండు ప్రశ్నలకు జవాబులు వ్రాయండి. 2 x 4= 8
i) దశరథుడు చేసిన పుత్రకామేష్టి యజ్ఞ ఫలితమేమి?
ii) సీతాపహరణ వృత్తాంతం వ్రాయండి.
iii) శ్రీరామ సుగ్రీవుల స్నేహాన్ని గురించి విశ్లేషించండి.
iv) రామ రావణ యుద్ధాన్ని వివరించండి.

Leave a Comment