CBSE Sample Question Papers for Class 10 Telugu Telangana 2020 PDF Download

CBSE Sample Question Papers for Class 10 Telugu Telangana 2020

CENTRAL BOARD OF SECONDARY EDUCATION
CLASS X- 2019-20
TELANGANA TELUGU (CODE-089)
SAMPLE PAPER

సమయం: 3 గంటలు                                                                                           మార్కులు: 80

Section-A (10 Marks)

ప్రశ్న 1.
ఈ క్రింది గద్యాన్ని చదివి అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం రాయండి.  5 x 2=10

విదేశీ యాత్రికులు చెప్పిన దానిని బట్టి కుతుబ్షాహీల రాజ్యం చాలా సంపన్నమైనది. 1618-22 లలో మచిలీపట్నంలో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఉద్యోగిగా ఉన్న “విలియం మెత్వోల్డ్ ” చాలా ప్రదేశాలలో ఒక్క పంట పండినా, రెండుమూడు పంటలు పండే చోట్లు కూడా ఉన్నాయనీ ఫలవంతమైన దేశమనీ, అన్ని వస్తువులూ చౌకగా సమృద్ధిగా దొరుకుతాయనీ రాశాడు. పన్నెండు పెన్నీలిస్తే ఎనిమిది కోళ్ళు ఇస్తారు. పది పెన్నీలకి గొర్రెకాని,మేకగాని, 18 పెన్నీల నుంచి 2 షిల్లింగుల వరకు మంచి పంది అని రాశాడు. 1665లో గోల్కొండ రాజ్యంలో ఉన్న ఫ్రెంచి యాత్రికుడు టావెర్నియర్ దేశంలో ధాన్యం, బియ్యం, పశువులు, గొర్రెలు, కోళ్లు ఇతర జీవితావసర వస్తువులు సమృద్ధిగా ఉన్నాయన్నాడు. దేశం నిండా చెరువులున్నాయని, అవి ఎత్తుప్రదేశంలో ఉండడం చేత అడ్డంగా గట్టుపోస్తే నీరు నిలబడుతుందని, వాటి క్రింద కాలువల ద్వారా పొలాలకు నీరు పారిస్తారని రాశాడు.17వ శతాబ్దంలో బంగాళాఖాతం గల ప్రదేశాలలో “ఔరే” అను బ్రిటిషు వర్తకుడు జింగాలీ కోస్తా ప్రపంచంలోనే అతి సారవంతమైన దేశం అని అన్నాడు. ఈ దేశపు సంపదలో ఏవో కొన్ని ఖనిజాలు తప్ప అవసరమైనవన్నీ ఉన్నాయి అన్నాడు. 1608-14 మధ్య నిజాంపట్టణాన్ని డచ్ వారి కాలంలో ఒక అజ్ఞాత లేఖకుడు సందర్శించాడు. కోస్తా మండలంలో సహజ సంపదలు అధికం అన్నాడు. అందుచేత కోస్తా నుంచి ధాన్యం,జొన్నలు,పప్పులు, వెన్న,నూనె తీసుకుని కొట్టి పడవలు దుగరాజు పట్నం, అర్మగాన్, పులికాట్, మైలాపూర్, కోవలం, గునువోడె, తేవారుపట్నం, పోర్టోలోనో, ఆట్రెజనం పట్నం మొదలయిన చోట్లకు పోతుంటాయన్నాడు.

ప్రశ్నలు:

1.మచిలీపట్నంలో ఈస్టిండియా కంపెనీ ఉద్యోగిగా ఉన్న దెవరు?
అ) టావెర్నియర్
ఆ) తెవెనా
ఇ) బౌరే
ఈ) విలియమ్ మెత్వోల్డ్

CBSE Sample Papers for Class 10 Bundle PDF Download for 2020 Board Exams
CBSE Sample Papers for Class 10 Bundle PDF Download for 2020 Board Exams

2. జింగాలీ దేశంలో, ఏవో కొన్ని ఖనిజాలు తప్ప అవసరమైనవన్నీ ఉన్నాయి అని చెప్పినది ఎవరు?
అ) బౌరే
ఆ) అజ్ఞాత వర్తకుడు
ఇ) టావెర్నియర్
ఈ) తెవెనా

3. గొల్కొండ రాజ్యం సందర్శించిన ఫ్రెంచి యాత్రికుడు ఎవరు?
అ) కుతుబ్ షాహీ
ఆ) బౌరే
ఇ) తెవెనా
ఈ) టావెర్నియర్

4. బౌరే అనే బ్రిటిషు వర్తకుడు జింగాలీ కోస్తా గురించి ఏమన్నాడు?
అ) ప్రపంచంలో పేద దేశం
ఆ) అది ప్రపంచంలో ధనిక దేశం
ఇ) ప్రపంచంలో సారవంతమైన దేశం
ఈ) ప్రపంచంలో అందమైన దేశం

5. అజ్ఞాత లేఖకుడు నిజాంపట్నం సందర్శించిన సంవత్సరం?
అ) 1667
ఆ) 1618 ఇ) 1665
ఈ) 1608-14

Section-B (14 Marks)

ప్రశ్న 2.
నీ పేరు రణధీర్. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయినగర్ కాలనీ వాసివి. కొంత కాలంగా కాలనీలో దొంగతనాలు జరుగుతున్న విషయం తెలిసినప్పటికీ పోలీసుల గస్తీ (పెట్రోలింగ్) సరిగా లేదు. ఈ విషయంలో కాస్త శ్రద్ధ చూపమని కోరుతూ స్థానిక పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఒక లేఖ రాయండి.  1 x 6 = 6

ప్రశ్న 3.
ఇతర దేశంలో స్థిరపడ్డ మీ మామయ్య చాలా రోజుల తరువాత ఈ దేశానికి వచ్చారు . మీ అమ్మ ఆనందానికి లెక్కలేదు. కానీ ఎక్కువ రోజులు ఉండకుండా వచ్చిన నాల్గవరోజే తిరిగి ప్రయాణమై వెళ్ళిపోయాడు. ఆరోజు మీ అమ్మ చాలా బాధపడింది. నీతో చాలాసేపు గడిపింది . వారి చిన్ననాటి ఆటలను ,జ్ఞాపకాలను, పల్లెటూరి వాతావరణం మొత్తం నీకు వివరించింది. మీ అమ్మ బాధను చూసి , చెప్పే విషయాలను విని నీలో కలిగిన ఆలోచనలను దినచర్య రూపంలో రాయండి.   1 x 4 = 4

ప్రశ్న 4.
లైసెన్స్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతున్న తొమ్మిదిమంది బాలురను ట్రాఫిక్ సి.ఐ సత్యమూర్తి పట్టుకున్నారు. ఈ క్రింది ఆధారాలను ఉపయోగించుకుని ఈనాడు దినపత్రికకు వార్తను తయారు చేయండి.  1 x 4 = 4
ఆధారాలు:
ఫిబ్రవరి 4 – వరంగల్ పట్టణం – కాకతీయనగర్ – ప్రభుత్వ లైసెన్స్ లేకుండా – తొమ్మిది మంది – ఆరాతీయగా – తొమ్మిది – పది – తరగతులు – మైనర్లు – తల్లిదండ్రులను – పోలీస్సేషన్ – కౌన్సిలింగ్ – విపరీతమైన వేగం – ప్రమాదం – మరోక సారి ఇలా – జైలు శిక్ష పడే అవకాశం – తల్లిదండ్రులకు ధన్యవాదాలు- విద్యార్థుల క్షమాపణ పత్రం.

Section-C (24 Marks)

ప్రశ్న 5.
క్రింది పద్యపాదానికి గణవిభజన చేసి దిగువున ఈయబడిన ప్రశ్నలకు క్రింద గల జవాబులలో సరైన దానిని ఎన్నుకుని రాయండి.  3 x 1 = 3

“మన శాస్త్రంబులు హక్కులున్ మనములున్ మాంగల్యముంబొందిపా”

i) పై పద్యములో గల గణాలు ఏవి?
(అ) భ,ర,న,భ,భ,ర,వ
(ఆ) మ,స,జ,స,త,త,గ
(ఇ) స,భ,ర,న,మ,య,వ
(ఈ) న,జ,భ,జ,జ,జ,ర

ii) పై పద్యంలో యతిమైత్రి ఎన్నో అక్షరము?
(అ) 11వ అక్షరము
(ఆ) 12వ అక్షరము
(ఇ) 13వ అక్షరము
(ఈ) 14వ అక్షరము

iii) పై పద్యపాదం ఏ వృత్త పద్యానికి చెందినది?
(అ) శార్దూలం
(ఆ) ఉత్పలమాల
(ఇ) చంపకమాల
(ఈ) మత్తేభం

ప్రశ్న 6.
క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా జవాబు ఇవ్వండి.   3 x 1= 3

(i) “హనుమంతుడు పెరిగినపుడు చుక్కలు తలలోని పువ్వులయ్యాయి”. ఈ వాక్యంలోని అలంకారం ఏది ?
అ) ఉపమాలంకారం
ఆ) అతిశయోక్తి అలంకారం
ఇ) అర్థాంతరన్యాస
ఈ) క్రమాలంకారం

(ii) ఈ క్రింది వానిలో క్రమాలంకారానికి ఉదాహరణ ఏది ?
అ) దేశం కోసం భగత్ సింగ్ ఉరిశిక్ష అనుభవించాడు
ఆ)మా ఊరి చెరువు సముద్రము వలె విశాలముగా ఉంది
ఇ) మా నానమ్మ తెల్లని జుట్టుతో, ముడతల శరీరంతో, చేతి కర్రతో అటు ఇటు తిరుగుతున్నది
ఈ) రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు సీతా ,ఊర్మిళా, మాండవి, శృతకీర్తి లను వివాహమాడిరి.

(iii) ఈ క్రింది వానిలో ఉపమాలంకారంలోని అంశాలు ఏవి ?
అ) సామాన్యము, విశేషము
ఆ) ధర్మారోపణ, తేడా లేకుండా చెప్పుట
ఇ) జాతి, గుణము
ఈ) ఉపమావాచకము, సమానధర

ప్రశ్న 7.
క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా జవాబు ఇవ్వండి.   3 x 1 = 3

1. క్రింది పదాలలో రూపక సమాసానికి చెందిన పదం
అ) చక్రపాణి
ఆ) కాంతివా
ఇ) ముల్లోకాలు
ఈ) గురుశిష్యులు

2. అన్య పదార్థ ప్రాధాన్యత కలిగిన సమాసం పేరు
అ) ద్వంద్వ
ఆ) రూపక
ఇ) ద్విగు
ఈ) బహుబ్లిహి

3. ద్వంద్వ సమాసం అనగా
అ) ఉభయ పదార్థ ప్రాధాన్యత కలది
ఆ) ఏక పదార్థ ప్రాధాన్యత కలది
ఇ) ఉభయ పదాలకు ప్రాధాన్యత లేనిది
ఈ) ఉభయులకూ అర్థం కానిది

ప్రశ్న 8.
క్రింది ప్రశ్నలకు అడిగిన విధంగా జవాబు ఇవ్వండి.  3 x 1 = 3

1. తత్సమంబులు అనగా
అ) తెలుగు తప్ప అన్ని భాషలకు చెందిన పదాలు
ఆ)తెలుగుతో సమానమైన పదాలు
ఇ) సంస్కృతంతో సమానమైన పదాలు
ఈ) సంస్కృతంతో సమానము కాని పదాలు

2. “కర్మధారయంబునందు తత్సమంబులకాలు శబ్దం పరంబగునపుడత్వంబున కుత్వంబు రుగాగమంబునగు….ఈ సూత్రమునకు ఉదాహరణ
అ) జవరాలు
ఆ)కఠినురాలు
ఇ) ముత్యాలు
ఈ) పగడాలు

3. ఆమ్రేడితంబు అనగా
అ) ద్విరుక్తము కానిది
ఆ) ద్విరుక్తము యొక్క పరరూపము
ఇ) ద్విరుక్తము యొక్క మొదటి రూపము
ఈ) ద్విరుక్తములోని రెండు రూపాలు

ప్రశ్న 9.
1. అశ్వము పడియె ఈ పదం ఈ క్రింది సూత్రములలో దేనికి చెందినది.  3 x 1=3
అ) ‘ఈ కార్యము కళలగు క్రియల మీద సహితము గానంబడియెడు’
ఆ) ‘తెనుంగు మీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు’
ఇ) ‘ఈ కార్యము కర్తృవాచి మువర్ణకంబునకు కలుగదు’
ఈ) ‘అందదుకు ప్రభృతులు యథా ప్రయోగంబుగ గ్రాహ్యంబులు

2. త్రికములు అనగా ఏవి
అ) ఏ,ఓ,ఆర్
ఆ) ఇ,ఉ,ఋ
ఇ) యవర
ఈ) ఆ,ఈ,ఏ

3. కట్టుగ్రము అనే పదం విడదీయగా వచ్చే రూపం ఏది
అ) కడు+ఉగ్రము
ఆ) కట్టు+ఉగ్రము
ఇ) ఉగ్రము+ఉగ్రము
ఈ) కడు+ కడు

ప్రశ్న 10.
ఈ క్రింది వాక్యాలలోని పర్యాయపదాలు గుర్తించి రాయండి.  3 x 1 = 3
i. వృద్ధులైన తల్లిదండ్రులకు పిల్లల అండ ఎంతో అవసరం . అందుకే వారికి ఆసరాగా ఉండడం మానధర్మం . తోడుగా ఉండడం మన కర్తవ్యం..
ii. విద్యార్థులు కేవలం విద్యలోనే వికాసం కాకుండా , సమాజానికి సంబంధించిన అనేక విషయాలలో జ్ఞానం సంపాదించి , ప్రగతి సాధించాలి ..
iii. రాజు మరణిస్తే ఒక తార రాలిపోతుంది ,కవి మరణిస్తే ఒక నక్షత్రం ఆకాశానికి ఎక్కుతుంది అన్నాడు జాషువా కవి.

ప్రశ్న 11.
క్రింది జాతీయాలలో రెండింటికి అర్థాలు రాసి సొంతవాక్య ప్రయోగం చేయండి.  2 x 2 = 4
i. తృణప్రాయం
ii. సుగ్రీవాట్ల
iii. ఓనమాలు దిద్దు
iv. భగీరథ ప్రయత్నం

ప్రశ్న 12.
క్రింది సామెతలలో రెండింటికి అర్థాలు రాయండి.  2 x 1 = 2
i. దొంగకు తేలు కుట్టినట్లు.
ii. పిట్ట కొంచెం కూత ఘనం.
iii. శంఖంలో పోస్తే గాని తీర్థం కాదు.
iv. మెరిసేదంతా మేలిమి కాదు.

Section-D (32 Marks)

ప్రశ్న 13.
క్రింది ప్రశ్నలలో రెండింటికి నూరేసి పదాలలో సమాధానాలు రాయండి.  2 x 3 = 6
1. సంపాదకీయాలు సమకాలీన అంశాలను ప్రతిబింబిస్తాయి దీనిని సమర్థిస్తూ రాయండి.
2. మనుమరాలి మాటలి విని తాతయ్య ఎందుకు అబ్బుర పడ్డాడు.
3. తెలంగాణను ఈజిప్టువలె ప్రపంచపు అంగడి – అనడానికి కారణాలు రాయండి.
4. ఎంతచెడ్డ గని, ఎంత బాగా బతికిన గని, ఇంకోణి ఆసరాతోటి మంది భుజాలెక్కి నడువకుండ పయినం సాగితె సాలు అన్న అక్కమాటల్లో ఆంతర్యం ఏమై ఉంటుంది.

ప్రశ్న 14.
క్రింది ప్రశ్నలలో మూడింటికి అరవైయేసి పదాలలో సమాధానాలు రాయండి.   3 x 2 = 6
1. నాటి తెలంగాణలో కూడా తెలుగు భాష ఉచ్చస్థితిలో ఉందని ఎట్లా చెప్పగలవు.
2. అక్కడక్కడ నక్కలు అదనుగాస్తున్న జాడలు కనబడ్తున్న వి అంటే మీకేం అర్థమైంది.
3. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును జాతి చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టంగా ఎందుకు అనుకుంటున్నారు.
4. సామల సదాశివ గారి రచనాశైలిని ప్రశంసిస్తూ రాయండి.

ప్రశ్న 15.
ఈ క్రింది పద్యంలో ఒక దానికి ప్రతిపదార్థమును రాయండి.   1 x 6=6

1. సిరి లేకైన విభూషితుండే యయి భాసిల్లున్ బుధుండొదలన్
గురుపాదానతి కేలనీగి చెవులందున్విన్కి వక్షంబునన్
స్థిర సత్యోక్తి భుజంబులన్విజయమున్ చిత్తంబునన్ సన్మనో
హర సౌజన్యము గల్గినన్ సురభిమల్లా! నీతివాచస్పతీ!

2. తెలగాణా భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం
చలనమ్మూరక పోవలేదు వసుధా చక్రమ్ము సారించి ఉ
జ్యల వైభాతిక భానునిన్ పిలిచి దేశంబంతటన్ కాంతి వా
ర్డులు నిండించిరి,వీరు వీరులు పరార్డుల్ తెల్గుజోదుల్ బళా!

ప్రశ్న 16.
క్రింది ప్రశ్న లలో ఏవేని రెండింటికి నూరేసి పదాలలో సమాధానములు రాయండి.   2 x 3 = 6
1. నగర జీవితంలోని ప్రతికూల అంశాలను ఇంత కఠినంగా వర్ణంచడంలో కవి ఆంతర్యం ఏమిటి?
2. తెలగాణమ్మున గడ్డిపోచయున్ సంధిచెన్ కృపాణమ్ము అని దాశరథి ఎందుకన్నాడు?
3. బిక్ష పాఠంలోని కథను సంక్షిప్తంగా రాయండి.
4. “ఎడారి దిబ్బలు దున్నితే ఫలమేముందనకు” అనే వాక్యం ద్వారా విద్యార్థులకు సినారె ఇచ్చే సందేశం ఏమై ఉండవచ్చు?

ప్రశ్న 17.
క్రింది ప్రశ్నలలో రెండింటికి నూట ఇరవైయేసి పదాలలో జవాబులు రాయండి.  2 x 4 = 8
1. రామలక్ష్మణులు విశ్వామిత్ర యాగాన్ని రక్షించిన వృత్తాంతాన్ని తెల్పండి.
2. సీతారాముల వివాహ వృత్తాంతాన్ని రాయండి.
3. రామ రావణ యుద్ధాన్ని గురించి వివరించండి.
4. భరతుని పాదుకా పట్టాభిషేకాన్ని గురించి తెలపండి.

Leave a Comment